COURT | టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi)-నాని కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ కోర్ట్ (Court). ప్రియదర్శి లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం State vs A Nobody ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోర్టు గదిలో నాటకాన్ని ఉత్కంఠభరితమైన తమ వాదనలతో కొనసాగించే న్యాయవాదులను కలవండి.. అంటూ ఇటీవలే ఓ వార్తను షేర్ చేసింది టీం.
తాజాగా కోర్ట్ సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ బిహైండ్ ది క్యారెక్టర్స్ వీడియోను విడుదల చేసింది. బాధితురాలు జాబిలి పాత్ర పరిచయంతో మొదలైన వీడియోలో శివాజీని మంగపతిగా, రోహిణిని సీతారత్నంగా చూపించబోతున్నట్టు తెలియజేశాడు డైరెక్టర్. ఈ కేసును వాదించే లాయర్‌గా ప్రియదర్శి కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.
కోస్టల్ ఏరియా, డాక్యుమెంట్స్, కోర్టు బోను, న్యాయ దేవత లాంటి విజువల్స్‌తో డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ ఇప్పటికే మూవీపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంతకీ ప్రియదర్శి టీం ఏ సమస్య మీద వాదిస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు గదిలో న్యాయవాదులు నాటకాన్ని తమ వాదనలతో ఉత్కంఠభరితంగా ఎలా కొనసాగించారనేది సస్పెన్స్ లో పెడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని నిర్మిస్తుండగా.. నాని సోదరి దీప్గి ఘంటా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది.
A special “Behind the Characters” video out now ✨
▶️ https://t.co/maNbwbh9J1Natural Star @NameisNani Presents#COURT – ‘State vs A Nobody’ ⚖️#CourtStateVsANobody in Cinemas March 14th. pic.twitter.com/cZdjU22gvt
— BA Raju’s Team (@baraju_SuperHit) February 4, 2025
కోర్ట్ మోషన్ పోస్టర్..
Super Subbu | సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సందీప్ కిషన్.. ‘సూపర్ సుబ్బు’ టీజర్ చూశారా.!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?