‘గరివిడి లక్ష్మి’ స్టేజీ ఎక్కితే పూనకాలే
‘గరివిడి లక్ష్మి’ పాత్ర తనకు దేవుడిచ్చిన వరమని, ఇది తనకు ప్రత్యేకమైన సినిమా అని, డైరెక్టర్ గౌరీనాయుడు సినిమాకు ఏం కావాలో అన్నీ నిజాయితీగా తీసుకున్నారని కథానాయిక ఆనంది తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టైటిల్ రోల్‌ని ఆనంది పోషించింది. గౌరినాయుడు జమ్ము దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. ఈసందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
హీరో అడివి శేష్, ప్రముఖ దర్శకులు బాబీ కొల్లి, హరీష్‌శంకర్, మారుతి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు ‘మా అమ్మాయి కృతిప్రసాద్ సొంతంగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకొని మూడు కథలను సెలక్ట్ చేసుకున్నది. వాటిలో ‘గరివిడి లక్ష్మి’ ఒకటి. టైటిల్ రోల్‌కు ఆనందిని ఎంపిక చేయడం గుడ్ ఛాయిస్. ఈ సినిమాపై కృతిప్రసాద్ వందశాతం ఫోకస్ పెట్టింది. నిర్మాతగా వందశాతం క్రెడిట్ తనదే.
ఇకనుంచి మాసంస్థ నుంచి మంచి సినిమాలే వస్తాయి. అది ‘గరివిడి లక్ష్మి’తో మొదలుకాబోతుంది’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. ‘గరివిడి లక్ష్మి’ పాత్ర తనకు దేవుడిచ్చిన వరమని, ఇది తనకు ప్రత్యేకమైన సినిమా అని, డైరెక్టర్ గౌరీనాయుడు సినిమాకు ఏం కావాలో అన్నీ నిజాయితీగా తీసుకున్నారని కథానాయిక ఆనంది తెలిపింది. షూటింగ్లో గరివిడి లక్ష్మిగా ఆనంది స్టేజ్ ఎక్కితే, తమకు పూనకాలు వచ్చేవని, ఈ సినిమాతో తను ఆడిస్తుంది, పాడిస్తుంది, అందర్నీ ఏడిపిస్తుందని డైరెక్టర్ గౌరీనాయుడు నమ్మకంగా చెప్పారు. ఇంకా కృతిప్రసాద్, నరేష్ వీకే, రాగ్ మయూర్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కూడా మాట్లాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
T-Hub | కలలకు రెక్కలు తొడిగి 11 వసంతాలు: అంతర్జాతీయ ఆవిష్కరణల వేదికగా ఎదిగిన ‘టీ-హబ్’
AP News | ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
KTR | బడా భాయ్ మోదీ.. తన ABVP చోటా భాయ్ రేవంత్‌పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు: కేటీఆర్
Chandrayaan | ‘చంద్రయాన్’ నుంచి ‘చీఫ్ సైంటిస్ట్’ శివ కుమార్ దీకొండ పాత్ర పరిచయం!
BRS | బీఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు.. గులాబీ గూటికి నిర్మల్ యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

