అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన ‘ఇన్షాల్లా’ సినిమాపై మరలా దృష్టిపెట్టనున్నట్లు తెలిసింది. సల్మాన్‌ఖాన్-అలియాభట్ జంటగా గతంలోనే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు.
చిత్రబృందం మధ్య తలెత్తిన సృజనాత్మక విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందనే విమర్శలొచ్చాయి. తాజాగా ఈ చిత్రాన్ని కొన్ని మార్పులతో తిరిగి పట్టాలెక్కించేందుకు సంజయ్‌లీలా భన్సాలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ టాక్. ఇందులో అలియాభట్ కథానాయికగా కొనసాగే అవకాశాలున్నాయని, అయితే ఆమెకు జోడీగా మరో హీరోను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది.
‘గంగూబాయి కథియావాడి’ చిత్ర విజయంతో సంజయ్‌లీలాభన్సాలీ-అలియాభట్ కాంబో మీద మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఇన్షాల్లా’ ప్రాజెక్ట్‌ను తిరిగి తెరపై తీసుకొస్తున్నారనే వార్తలు బాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.