నాని పాన్ ఇండియన్ ప్లాన్స్ వేస్తున్నాడా..?
నాని | సినిమాలకు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా బాగానే పాపులారిటీ వచ్చేసింది. ఈయన చేసిన జెర్సీ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు రావడంతో నాని గురించి చర్చ జరుగుతుంది

నాని సినిమాలకు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా బాగానే పాపులారిటీ వచ్చేసింది. ఈయన చేసిన జెర్సీ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు రావడంతో నాని గురించి చర్చ బాగానే జరుగుతుంది. హీరో కంటే నిర్మాతగా కూడా నాని అభిరుచి సూపర్. ఎందుకంటే ఈయన నిర్మించిన అ..! సినిమాకు అప్పట్లో రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత సరైన కథలు ఎంచుకుంటూ నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు. గతేడాది హిట్ సినిమాతో నిర్మాతగా మరో సూపర్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు ఈయన హిట్ 2 చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ రెండో భాగం రూపొందుతోంది. తొలిభాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో భాగంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ లైన్లోకి వచ్చాడు. HIT అంటే హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అని అర్థం.

ఇందులో ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కేడీ పాత్రలో శేష్ కనిపిస్తున్నాడు. ఈయన ఫస్ట్ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాలో అడవి శేష్‌ను తీసుకోడానికి మంచి ప్లాన్ ఉంది. అడవి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం. జూన్‌లో మేజర్ సినిమా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళంలో కూడా మేజర్ సినిమా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా హిట్ అయితే అడవి శేష్ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. ఆ తర్వాత నాని నిర్మిస్తున్న హిట్ 2 సినిమాపై కూడా నేషనల్ వైడ్‌గా పాపులారిటీ వస్తుంది.

ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయొచ్చు. పైగా డిజిటల్ – శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వస్తుంది. ఇలా ఏ విధంగా చూసినా హిట్ 2 సూపర్ ప్రాఫిటబుల్ వెంచర్ కావడం ఖాయం. ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న తర్వాతే అడవి శేష్ ను తన సినిమాలో హీరోగా తీసుకున్నాడు నాని. పైగా విశ్వక్ సేన్ కంటే అడవి శేష్ పారితోషికం ఎక్కువే. ఈయన సినిమాకు కనీసం రూ.4 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ‘హిట్ 2-ది సెకండ్ కేస్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ‘మేజర్’ షూటింగ్ అయిన తర్వాతే మొదలు కానుంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటించబోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
థియేటర్స్ మూసివేయం : మంత్రి తలసాని
రవితేజ: ముగ్గురు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్
పవన్ సినిమాతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి విజయదేవరకొండ
సీక్రెట్ ప్లేస్‌లో సారా..ట్రెండింగ్‌లో స్టిల్స్
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
మహేశ్‌బాబు తండ్రిగా మలయాళ నటుడు..?
జనాల్లేక థియేటర్స్ మూసుకుంటున్న యాజమాన్యం
వర్షంలో చైతూ, సాయిపల్లవి డ్యాన్స్
నిన్ను మించిన వాళ్లు లేరు.. కంగనపై సమంత ప్రశంసల వర్షం
థాయ్‌లాండ్ ఫారెస్ట్‌లో 15 రోజులున్నా: రానా
కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య ఏం చేస్తుంది?
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- hit 2
- Nani
- telugu cinema
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

