ఎంత బిజీ షెడ్యూల్‌తో ఉన్నా అభిమానులతో చిట్ చాట్ చేసేందుకు కొంత సమయం పెట్టుకుంటారు కొంతమంది హీరోలు. అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు నాని (Nani). శ్యామ్ సింగరాయ్ విడుదల సమయంలో అభిమానులను కలిసిన నాని మరోసారి వారి కోసం సమయం కేటాయించాడు. త్వరలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా (Dasara) ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది దసరా.
ఈ నేపథ్యంలో అభిమానుల కోసం (Nani fans meet)ముఖాముఖి ఏర్పాటు చేశాడు నాని. ఇటీవలే న్యూఇయర్ సందర్భంగా శౌర్యువ్ డైరెక్షన్లో 30వ సినిమా కూడా ప్రకటించేశాడు నాని. తనతో చిట్ చాట్ చేసేందుకు వచ్చిన ప్రతీ అభిమానితో కెమెరాకు ఫోజులిస్తూ ఫొటోలు దిగాడు నాని. ఈ స్టార్ హీరోను కలిసేందుకు వచ్చిన వారిలో ఎక్కువ మంది అమ్మాయిలు కాగా.. వారంతా చాలా దూరం నుంచి వచ్చారట. ఇక నానిని కలిసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారట మేకర్స్.
ఈ సందర్భంగా అభిమానులతో దసరా సినిమా గెటప్‌లో ఫొటోషూట్ సెషన్లో పాల్గొన్నాడు నాని. దివంగత లెజెండరీ నటి సిల్క్ స్మిత ఫొటోగ్రాఫ్ ముందు కూర్చున్న తమ అభిమాన నటుడితో ఫొటో దిగే అవకాశం రావడంతో సంతోషంలో ఎగిరి గంతేస్తున్నారు నాని ఫాలోవర్లు, అభిమానులు. 6 నెలల గ్యాప్‌లో తమను కలిసేందుకు మరోసారి అవకాశమివ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అభిమానులతో సరదాగా..
Finally i got a click with My Nani Anna🤩😍❤@NameisNani
Thank you 🙂 @Pradeepnani79 @SREENU_24 @Nameiskarthik01#Nanifansmeet #NaniNext #Nani #Dasara pic.twitter.com/yww6BFLCmJ
— Gangadhar Medisetti (@NameIsGangadhar) January 3, 2023
Ye age group ki ayina Natural Star @NameisNani ante piche 😍😍😍
The way he carried that rugged look & attire 🔥🔥🔥#Dasara gonna be a Magnificent one 🤙🤙#Nani #DasaraFromMar30th pic.twitter.com/dvPBwEkv8t
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 3, 2023
Diehard fan of Natural Star @NameisNani, Sandeep from Jangareddy gudem permanently tattooed his idol #Nani face on his fore arm 😍❤️🔥 pic.twitter.com/r4OEsyiG3s
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 3, 2023