సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 27, 2021 , 00:34:19

అక్షర పోరాటం

అక్షర పోరాటం

నందితాశ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అక్షర’. బి.చిన్నికృష్ణ దర్శకుడు. సురేష్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మాతలు. ఫిబ్రవరి 26న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్‌ ఇది. అక్షర ఎవరు? విద్యావ్యవస్థలోని లోతుపాతులపై ఆమె ఎలాంటి పోరాటం సాగించిందనే కథాంశంతో నవ్విస్తూనే ఆలోచనను రేకెత్తిస్తుంది. థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో సినిమాను ఓటీటీ విడుదల చేసే అవకాశాలు వచ్చినా తిరస్కరించాం. సమకాలీన సమస్యను చర్చిస్తూ  రూపొందించిన ఈ చిత్రం  అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని తెలిపారు. సత్య, మధునందన్‌, షకలకశంకర్‌, శ్రీతేజ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నగేష్‌ బన్నెల్‌, సంగీతం: సురేష్‌ బొబ్బలి.


VIDEOS

తాజావార్తలు


logo