నవీన్‌చంద్ర, మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ, పీ రవిశంకర్, అనన్య రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తగ్గేదే లే (Thaggedhe Le). శ్రీనివాసరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ మూవీ నుంచి తగ్గేదే లే టైటిల్ ట్రాక్ (Thaggedhe Le Lyrical Song) లిరికల్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు.
ఈ పాటలో బెంగాలీ బ్యూటీ నైనా గంగూలీ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టేస్తుంది. వంగవీటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నైనా గంగూలీ. 2021లో పరంపర వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ ఏడాది సుమంత్‌తో కలిసి మళ్లీ మొదలైంది సినిమాలో మెరిసింది.
రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన డేంజరస్‌లో అందాలను ఆరబోసినా..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా…నర్రా అశోక్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకులకు రాబోతుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Shikhar Dhawan | సినిమాల్లోకి శిఖర్ ధవన్ ఎంట్రీ.. వివరాలు చెప్పిన స్టార్ క్రికెటర్
Read Also : Ammu Trailer | ఐశ్వర్యలక్ష్మి కొత్త సినిమా.. గృహహింస నేపథ్యంలో అమ్ము ట్రైలర్
Read Also : Raghu Babu Look | రంగంపేట ప్రెసిడెంట్‌గా రఘుబాబు..జిన్నా నుంచి లేటెస్ట్ లుక్