టాలీవుడ్ (Tollywood) యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా చిత్రం వరుడు కావలెను (Varudu Kavalenu). లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో (Ritu Varma) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. పెళ్లి చూపులు కెఫేలోనా కొంచెం వివరంగా చెప్తారా అంటూ ప్రవీణ్ సంభాషణలతో మొదలైంది ట్రైలర్. కిరీటి దామరాజు అమ్మాయేది అని నదియాను అడుగుతుంటే..అది రాదు బాబు తనకు పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు అంటూ చెప్తోంది.
పొగరుబోతులకు కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతీ సీజన్లో ఆవిడే విన్నర్ తెలుసా..అంటూ వెన్నెల కిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచటం ఖాయమని తెలుస్తోంది. పెళ్లి చూపుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఫైనల్ ఎలా ఒక్కటయ్యారన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.
ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా..గణేష్ కుమార్ రావూరి మాటలు అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత