Nagarjuna | అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇటీవలే ధమాకా ఫేం రైటర్ ప్రసన్నకుమార్ (Prasanna Kumar)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రసన్నకుమార్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో షురూ కానుంది. కాగా తాజాగా మరో క్రేజీ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ వచ్చే నెలలో మైసూర్లో మొదలు కానుంది.
ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన పొరింజు మరియమ్ జోస్‌కు తెలుగు రీమేక్‌గా వస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
అల్లరి నరేశ్ ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టీజర్ రేపు విడుదల కానుంది. అల్లరి నరేశ్ ఓ వైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తున్నాడు. గతేడాది స్టాండప్ రాహుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజ్‌తరుణ్ ఆ తర్వాత మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సోలో హీరోగా సరైన బ్రేక్ రాకపోవడంతో.. ఇప్పుడు రూటు మార్చి సెకండ్ లీడ్ రోల్లో కనిపించేందుకు రెడీ అయ్యాడు రాజ్ తరుణ్.
Ram Charan | ఇరవై రోజుల ముందే యూఎస్‌కు రాంచరణ్.. కారణమిదే..!
AK 62 | అజిత్‌తో నాలుగోసారి.. మరో హిట్టు పడ్డట్టేనా..?
Allu Aravind | అల్లు అర్జున్ను చూసి గర్వపడుతున్నా : అల్లు అరవింద్
Janhvi Kapoor | నీ కోసం ప్రతీ చోటా వెతుకుతున్నా అమ్మా.. జాన్వీకపూర్ భావోద్వేగ సందేశం