Tirumala Tirupati Laddu | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేలరేగుతున్నాయి. కాగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే విచారణ జరపాలని అధికారులను ఆదేశించాడు. అయితే ఈ ఘటనపై ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, రాజకీయ, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ సెక్రటరీ జనరల్ నటుడు నాగబాబు కూడా ఎక్స్ వేదికగా స్పందించాడు. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కాని కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు అంటూ వైఎస్ఆర్సీపీపై పరోక్షంగా మండిపడ్డారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం” ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనేతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం.. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కాని కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు
ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవున్ని నిష్టతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుంది తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు, అంతటి విశిష్టతమైన ప్రసాదాన్ని అందులోను తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత గల పుణ్యక్షేత్రం లోని లడ్డు ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు,అందుకే తితిదే లాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన “తిరుమల తిరుపతి దేవస్థానం” ప్రసాదాన్ని జంతు కొవ్వుతో,చేప నూనేతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవం క్షమించరాని నేరం..
”పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కాని కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు”
ఒక…
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 20, 2024
Also Read..