Stroke | ప్రపంచవ్యాప్తంగా యేటా అత్యధిక మరణాలకు గుండెజబ్బులు, స్ట్రోక్ కారణమవుతున్నాయి. ప్రస్తుత కాలంలో స్ట్రోక్ తీవ్రమైన ముప్పుగా మారింది. ఇది 30 ఏళ్లలోపు వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. బ్రెయిన్ స్ట్రోక్ తీవ్రమైన సమస్య అని.. మెదడుకు రక్తం సరఫరా చేయడంలో అంతరాయం కలిగిస్తుందని.. లేకపోతే మెదడులో రక్తస్రావానికి కారణమవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మెదడులోని కొన్ని భాగాలకు ఆక్సిజన్ అందదని.. దాని కారణంగా మెదడులోని కణాలు చనిపోవడం ప్రారంభమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. గత దశాబ్దంలో యువతలో స్ట్రోక్ కేసులు వేగంగా పెరిగాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని.. దాని బారినపడకుండా ఉండేందుకు లైఫ్స్టయిల్లో మార్పులు చేసుకోవాలని, డైట్‌ని తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన సమయంలో ఆలస్యం చేయకుండా సకాలంలో చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానికి దూరంగా ఉంటే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. స్ట్రోక్ ప్రాణాంతకం మాత్రమే కాదు, ప్రాణాలతో బయపడినవారు పక్షవాతం తదితర ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కూడా పక్షవాతం వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఎందుకంటే సకాలంలో చికిత్స మెదడుకు శాశ్వత నష్టాన్ని నిరోధించవచ్చు. స్ట్రోక్ ప్రధాన లక్షణాలను తెలుసుకోవడం ముఖ్యం. స్ట్రోక్ తొలి సంకేతంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటే అప్రమ్తతంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నొప్పితో పాటు తరచుగా వికారం, వాంతులు, మూర్ఛ సైతం స్ట్రోక్ సంకేతం కావొచ్చని పేర్కొంటున్నారు. వెంటనే రక్తపోటును పరీక్షించుకోవాలని చెబుతున్నారు. హైబీపీ కూడా స్ట్రోక్‌కు ప్రధానంగా కారణంగా పేర్కొంటున్నారు.
స్ట్రోక్‌తో చేతులు, కాళ్లు బలహీనంగా ఉండడం, తిమ్మిరి అనిపిస్తుంది. శరీరంలోని ఒక భాగంలో అకస్మాత్తుగా బలహీనత ఉండడం.. తిమ్మిరి కనిపిస్తే స్ట్రోక్ సంకేతమేనని పేర్కొంటున్నారు. ముఖం, ఒక చేయి, ఒక కాలు, ముఖ్యంగా శరీరంలో ఒక వైపు జరుగుతుందని జరుగుతందని పేర్కొంటున్నారు. స్ట్రోక్ కారణంగా తల తిరగడం, సమతుల్యత కోల్పోవడం కూడా సాధారణం. అకస్మాత్తుగా తల తిరగడం, బ్యాలెన్స్ కోల్పోవడం, తలనొప్పితో పాటు నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే.. వెంటనే మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నడుస్తున్నప్పుడు పడిపోవడం, కాళ్లలో ఆకస్మిక బలహీనత, అస్థిరమైన నడక వంటి సంకేతాలను తీవ్రంగా పరిగణించాలని చెబుతున్నారు. ఎవరికైనా ఇలాంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి.. అవసరమైన పరీక్షలు చేయించుకొని.. చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also :
“Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. రోజూ ఉదయాన్నే ఈ పని చేయండి..!”
“Health Tips | ప్రేవుల ఆరోగ్యం మెరుగుపడేందుకు గట్ హెల్త్ డ్రింక్స్”