Royal Enfield Bullet | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన బుల్లెట్ 350 మోటారు సైకిళ్లను విస్తరిస్తోంది. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ తన బుల్లెట్ 350 ‘బెటాలియన్ బ్లాక్’ మోటారు సైకిల్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1,74,730 పలుకుతుంది. ఐకానిక్ మోడల్ మోటారు సైకిల్ పలు మార్పులతో వస్తోంది.
వింటేజ్ డిజైన్ క్యూస్, బెటాలియన్ బ్లాక్ ఎడిషన్ మోటారు సైకిళ్లు పాత మోడల్ బైక్స్ నుంచి బెంచ్ సీట్, హ్యాండ్ పెయింటెడ్ గోల్డ్ పిన్ స్ట్రైప్స్, ట్యాంక్ అండ్ సైడ్ ప్యానెల్స్ మీద 3డీ బ్యాడ్జెస్ వంటి పలు రెట్రో ఫీచర్లను తీసుకొస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్ మోటారు సైకిల్. స్పోక్ వీల్స్‌తోపాటు క్రోమ్ రిమ్స్, బ్లాక్ మిర్రర్స్, ఓల్డ్ లైసెన్స్ ప్లేట్, టెయిల్ లాంప్ రిమినిస్కెంట్ వంటి ఫీచర్లు జత చేశారు.
జే-ప్లాట్ ఫామ్ పై రూపుదిద్దుకున్న 349సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటారు కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 20.2 హెచ్‌పీ విద్యుత్, 27 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటది. సేఫ్టీని పెంపొందించే సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో కూడిన 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 153 ఎంఎం రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇక మిలిటరీ వేరియంట్ బెటాలియన్ బ్లాక్ ఎడిషన్, బ్లాక్ గోల్డ్ స్టాండర్డ్ వేరియంట్లలో లభిస్తుందీ రాయల్ ఎన్ ఫీల్డ్ ‘బెటాలియన్ బ్లాక్’ మోటారు సైకిల్. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ తన బుల్లెట్ బ్లాక్ బెటాలియన్ ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.