Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్లో నటించిన చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా తెరకెక్కిన ఈ మూవీకి బాబీ (Bobby) దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీ రోల్స్‌లో నటించారు.
బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, రోనిత్ రాయ్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఫ్యామిలీతోపాటు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ టీం ఏర్పాటు చేసిన బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్లో సినిమాకు ప్రీక్వెల్ ఏమైనా ఉండబోతుందా..? అని నిర్మాత సూర్య దేవర నాగవంశీని ఓ రిపోర్టర్ అడిగాడు.
ఈ విషయమై మాట్లాడుతూ.. ప్రీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నామన్నాడు నాగవంశీ. సినిమాలో ఓ విగ్రహం తల లేకుండా కనిపిస్తుంది. ఇదే పాయింట్‌ను హీరోగా చేసి డాకు మహారాజ్ ప్రీక్వెల్‌గా సినిమా చేయాలని మేం ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇంతకీ ప్రీక్వెల్ బాలకృష్ణతోనే ఉండబోతుందా..? లేదంటే వేరే యాక్టర్ ఎవరైనా కనిపిస్తాడా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
డాకు మహారాజ్ ప్రిక్వెల్ తీస్తున్నాం : నిర్మాత #NagaVamsi#DaakuMaharaj pic.twitter.com/ZG8JXB1CU7
— Sai Satish (@PROSaiSatish) January 12, 2025
Mazaka Teaser | రకుల్ బెటరా.. రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ.. సందీప్ కిషన్ మజాకా టీజర్
Game Changer | గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేకా?.. రిపోర్ట్స్ ఏం అంటున్నాయి అంటే.!