Naga Chaitanya | కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య?
NC22 Movie | అక్కినేని నాగచైతన్య వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అయితే ఇటీవలే రిలీజైన 'థాంక్యూ' నాగచైతన్య స్పీడ్‌కు బ్రేకులు వేసింది.
NC22 Movie | అక్కినేని నాగచైతన్య వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అయితే ఇటీవలే రిలీజైన ‘థాంక్యూ’ నాగచైతన్య స్పీడ్‌కు బ్రేకులు వేసింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించాడు. ఇక ప్రస్తుతం చైతన్య మానాడు ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘NC22’ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో నటించనున్నాడట. గతంలో ఎన్నడూ చేయలేని పాత్రలో నాగచైతన్య కనిపించనున్నాడు. కాగా చైతన్య ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో పోలీస్ అధికారికారిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో చై డీఎస్పీగా నటించాడు. ఇక ఇప్పుడు ‘NC22’లో కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘ధూత’ వెబ్‌సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ నిర్మిస్తుంది. ఈ వెబ్‌సీరీస్‌లో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు.
Read Also:
Allu Arjun | అరుదైన అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్.. తొలి టాలీవుడ్ హీరోగా రికార్డు
Sardar Movie | అప్పుడే ఓటీటీలోకి కార్తి ‘సర్దార్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

