Sardar Movie On OTT | తమిళ హీరో కార్తికు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది కార్తి మూడు సినిమాలను రిలీజ్ చేశాడు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ఇటీవలే ఈయన నటించిన ‘సర్దార్’ విడుదలై ఘన విజయం సాధించింది. ‘విరుమన్’, ‘PS-1’ వంటి వరుస హిట్ల తర్వాత అదే జోరులో ‘సర్దార్’ రిలీజై హ్యట్రిక్‌గా నిలిచింది. పీఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజై కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇటీవలే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా సర్దార్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని నవంబర్18 నుండి ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కార్తి డ్యూయల్ రోల్లో నటించాడు. తండ్రి, కొడుకుగా మంచి నటనను కనబరిచాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తెలుగులో ఈచిత్రాన్ని అన్నపూర్ణ స్టూడీయోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేశాడు.
Ee Season Athi Pedda Blockbuster Cinema, Biggest Box-office Sensation, Mass Action Blockbuster, Karthi’s SARDAR mee Aha lo November 18 nundi.#SardarOnAHA @Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @AnnapurnaStdios @ActressLaila pic.twitter.com/CJooQy7j54
— ahavideoin (@ahavideoIN) November 11, 2022