Allu Arjun | అరుదైన అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్.. తొలి టాలీవుడ్ హీరోగా రికార్డు
Allu Arjun Wins another Prestigious Award | 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన బన్నీ హవానే కనిపిస్తుంది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రతి చోట అల్లుఅర్జున్ పేరు మార్మోగిపోతుంది.
Allu Arjun Wins another Prestigious Award | ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన బన్నీ హవానే కనిపిస్తుంది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రతి చోట అల్లుఅర్జున్ పేరు మార్మోగిపోతుంది. అవార్డు ఫంక్షన్ ఏదైనా సరే అందులో బన్నీ పేరు కచ్చితంగా వినబడుతుంది. కాగా గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిన బన్నీకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప రాజ్‌గా బన్నీ నటనకు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే పలు ఉన్నత అవార్డులు రాగా.. ఇప్పుడు బన్నీ మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు.
తాజాగా అల్లుఅర్జున్ ప్రతిష్టత్మక GQ MOTY-2022 ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం విశేషం. ఈ అవార్డు రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు పొందిన తొలి దక్షిణాది హీరోగా అరుదైన ఘనత సాధించాడు. ఇక పుష్ప రాజ్‌గా బన్నీ నటనకు ఫిలింఫేర్, సైమా వంటి అత్యున్నత అవార్డులు వచ్చాయి.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Read Also:
Sardar Movie | అప్పుడే ఓటీటీలోకి కార్తి ‘సర్దార్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Yashoda Movie | సమంత ముందు భారీ లక్ష్యం.. ‘యశోద’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని కోట్లా?
Allu Arjun-Trivikram | ఆ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా.. సినీ ప్రియులకు పండగే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

