Yashoda Movie | సమంత ముందు భారీ లక్ష్యం.. ‘యశోద’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని కోట్లా?
Yashoda Movie Break even Target | సరోగసి నేపథ్యంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం యశోద. రిలీజ్‌కు ముందు చిత్రబృందం భారీగా ప్రమోషన్లు జరుపడంతో యశోద సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం అంటే విశేషం అనే చెప్పాలి.
Yashoda Movie Break even Target | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘యశోద’ ఒకటి. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. రిలీజైన ప్రతి చోట పాజిటీవ్ రివ్యూలు వస్తున్నాయి. ఎంగేజింగ్ థ్రిల్లర్ అని, సమంత నట విశ్వరూపం చూపించిందని, సమంత హిట్టు కొట్టేసిందని రివ్యూలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలో తెలుసా? యశోద సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 21.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్టు కోసం రూ.22 కోట్లు సాధించాల్సి ఉంటుంది. రిలీజ్‌కు ముందు చిత్రబృందం భారీగా ప్రమోషన్లు జరుపడంతో యశోద సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక మౌత్ టాక్ పాజిటీవ్‌గా వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమి కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం అంటే విశేషం అనే చెప్పాలి.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సమంతకు కొత్తేమి కాదు. గతంలో ఈమె ‘యూ టర్న్’, ‘ఓ బేబి’ వంటి మహిళా ప్రధాన చిత్రాలు చేసింది. ఈ రెండు కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ఇక ఈ చిత్రం కూడా సమంత హిట్ లిస్ట్‌లోకి వెళ్తుందని సమంత అభిమానులు భావిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 12నే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
Read Also:
“Yashodha Movie | ‘యశోద’ సినిమాకు అన్ని కోట్లు ఖర్చయిందా?”
Allu Arjun-Trivikram | ఆ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా.. సినీ ప్రియులకు పండగే..!
Ori Devuda Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓరి దేవుడా’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

