Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే లవ్ స్టోరీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ స్టార్ యాక్టర్లు ప్రస్తుతం తండేల్ (Thandel)లో నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే తాజాగా మరో క్రేజీ నిర్ణయాన్ని తీసుకున్నారన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తండేల్ మలయాళం వెర్షన్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందట. సాయిపల్లవికి మలయాళంలో సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే. ఒకవేళ ఇదే నిజమైతే తండేల్ సినిమాకు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తండేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న తండేల్ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Manchu Vishnu | కన్నప్ప ప్రమోషన్స్ టైం.. ఈ తరానికి కన్నప్ప ఎవరంటున్న మంచు విష్ణు
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?