నాగచైతన్య (Naga Chaitanya), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్లో వస్తున్న చిత్రం కస్టడీ (Custody). NC 22గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. కస్టడీ మ్యూజికల్ రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ Junglee Music దక్కించుకుంది.
మానాడు సినిమాతో శింబుకు గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన వెంకట్ ప్రభు ..ఈ సారి కస్టడీ సినిమాతో నాగచైతన్యకు కూడా మంచి హిట్టు అందిస్తాడని ఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
నాగచైతన్య ఈ చిత్రంలో శివ అనే పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీలో వెన్నెల కిశోర్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, శరత్‌కుమార్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తుండగా..అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.
Read Also : Sivaji The Boss | తలైవా అభిమానులకు డబుల్ బొనాంజా.. మరో సినిమా రీరిలీజ్
Read Also : Satyadev | చిరంజీవి క్లాసిక్ రీమేక్‌లో నటించాలని ఉంది: సత్యదేవ్
Read Also : Vishnu Vishal | గుత్తా జ్వాల కష్టకాలంలో నా లైఫ్‌లోకి వచ్చింది: విష్ణువిశాల్