ఎంబీబీఎస్‌లో అదనపు ఫీజుల దోపిడీని అరికట్టాలి
ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అదనపు ఫీజుల వసూళ్లను తక్షణమే అరికట్టాలని మెడికో పేరెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజుల సత్యనారాయణచారి డిమాండ్ చేశారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ సూల్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘మెడికో పేరెంట్స్ ఫ్యామిలీ మీట్'లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చూడాలని, మెరుగైన హాస్టల్ వసతులు కల్పించాలని కోరారు.
- హాస్టళ్లలో వసతులు కల్పించాలిమెడికో పేరెంట్స్
- అసోసియేషన్ డిమాండ్
- సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అదనపు ఫీజుల వసూళ్లను తక్షణమే అరికట్టాలని మెడికో పేరెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజుల సత్యనారాయణచారి డిమాండ్ చేశారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ సూల్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘మెడికో పేరెంట్స్ ఫ్యామిలీ మీట్’లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చూడాలని, మెరుగైన హాస్టల్ వసతులు కల్పించాలని కోరారు. నాలుగున్నరేండ్ల ఎంబీబీఎస్ కోర్సుకు అదనంగా మరో ఆరునెలల ఫీజు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత ఏడాది 20 మందికి, ఈ ఏడాది ఇద్దరు పేద విద్యార్థులకు అసోసియేషన్ ద్వారా ఫీజులు చెల్లించి అండగా నిలిచామని తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జీవో నంబర్ 150 వల్ల స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతున్నదని, 6 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలోనే చదివిన వారికే లోకల్ కోటా వర్తింపజేయాలని అన్నారు. సమస్యల పరిషారానికి తల్లిదండ్రులు ఐక్యంగా పోరాడాలని సూచించారు. అరకొర వసతులతో నడుస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పొడిశెట్టి రమేశ్, పల్లవి ఎడ్యుకేషన్ డైరెక్టర్ మలా నవీన్‌కుమార్, అసోసియేషన్ ప్రతినిధులు బొడ్డుపల్లి అంజయ్య, పీ సుజాత, రవికుమార్ కొప్పుల, కట్ట వెంకటరావు (కేవీఆర్) తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

