గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 23, 2021 , 12:31:21

ప్ర‌భాస్ మూవీపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

ప్ర‌భాస్ మూవీపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

మ‌హాన‌టి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. స్కై ఫై థ్రిల్లర్ సబ్జెక్టు తో  ఈ సినిమాను సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో వ‌ర‌ల్డ్ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించ‌నున్నాడు అశ్వినీద‌త్. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్స్ రాక‌పోయే స‌రికి నెటిజ‌న్స్ నిరూత్సాహం చెందుతున్నారు. తాజాగా ఓ నెటిజ‌న్ వ‌చ్చే సంక్రాంతికి వ‌స్తుందేమో అని కామెంట్ పెట్టాడు.

నెటిజ‌న్ రిప్లైకు స్పందించిన నాగ్ అశ్విన్ ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే జ‌న‌వ‌రి 29 మ‌రియు ఫిబ్ర‌వ‌రి 26 తేదిల‌లో స‌ర్‌ప్రైజెస్ రానున్నాయి అంటూ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ ట్వీట్‌తో అభిమానుల‌లో ఆనందం వెల్లివిరిసింది . ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్, ఆదిపురుష్ చిత్రాల క‌న్నా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌నున్న పీరియాడిక‌ల్ మూవీపైనే  భారీ అంచనాలు ఉన్నాయి. 

VIDEOS

logo