Nabha Natesh | ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది నభా నటేశ్. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం ఈ భామకు ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయాయి. చివరగా డార్లింగ్ సినిమాలో నటించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. నెట్టింట చురుకుగా ఉండే ఈ భామ దీపావళి సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. హాట్‌హాట్‌గా కనిపించే ఈ అమ్మడు సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయింది.
నభానటేశ్ మెరూన్, గోల్డ్ శారీలో తళుక్కుమంది. ఈ చీర నభానటేశ్ అమ్మది కావడం విశేషం. తన తల్లి చీర కట్టుకోవడం మ్యాజికల్ మూమెంట్ అని.. ప్రత్యేకించి ఈ చీర నాన్న అమ్మకు ఇచ్చిన తొలి గిఫ్ట్ అని షేర్ చేసుకుంది నభా నటేశ్. అంతేకాదు తన తల్లి అదే చీర వేసుకున్న త్రోబ్యాక్ స్టిల్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట అందరి అటెన్షన్ తనవైపునకు తిప్పుకుంటోంది.
ఇక తన తల్లి భాగ్యలక్ష్మిపై నభానటేశ్ చూపిస్తున్న ప్రేమను అందరూ ప్రశంసిస్తున్నారు. నభానటేశ్ ప్రస్తుతం నిఖిల్‌తో కలిసి స్వయంభులో నటిస్తుంది. దీంతోపాటు విరాట్ కర్ణ నాగబంధంలో హీరోయిన్గా నటిస్తోంది.
Wishing everyone a happy Diwali 🪔 pic.twitter.com/iV4SvsCDds
— Nabha Natesh (@NabhaNatesh) October 20, 2025
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!