Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో సూర్య టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా సూర్య టీం హైదరాబాద్‌లో తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది.
ఈవెంట్‌కు సూర్య, డైరెక్టర్ శివ, మైత్రీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ శశితోపాటు పలువురు హాజరయ్యారు. మైత్రీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు సూర్య సార్ అంటే చాలా ఇష్టం. జ్ఞానవేల్ రాజా సినిమాలంటే మాకు కూడా చాలా ఇష్టం. నేను కంగువలో కొన్ని సీన్లు చూశా. ఆ సన్నివేశాలు అసాధారణమైనవిగా ఉన్నాయి. కంగువ అంచనాలను చేరుకుంటుందన్నారు.
కంగువ బెనిఫిట్ షోలకు అనుమతి తీసుకుంటాం. ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభమవుతాయి. నిర్మాత ఒప్పుకుంటే 1 AM షోలను కూడా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మరి సూర్య అభిమానుల కోసం ఈ స్పెషల్ షోలు అందుబాటులోకి వస్తాయా.. అన్నది చూడాలి.
కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి