The Paradise | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు ది ప్యారడైజ్ (THE PARADISE).దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన మోహన్ బాబు పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ మూవీలో సీనియర్ యాక్టర్ తనికెళ్లభరణి కీ రోల్లో కనిపించబోతున్నాడట.
తాజా టాక్ ప్రకారం దసరా డైరెక్టర్ ఇదివరకెన్నడూ కనిపించని విధంగా భరణిని నెగెటివ్ రోల్లో చూపించబోతున్నాడన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. ఈ విషయాన్ని భరణినే స్వయంగా చెప్పారు. ది ప్యారడైజ్ తనను పూర్తి కొత్త అవతారంలో చూపిస్తుందని.. తన పాత్ర, యాక్టింగ్ ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురి చేయడం పక్కా అని.. ప్రేక్షకులకు చాలా ప్రభావం చూపించేలా తన రోల్ ఉంటుందని చెప్పారు భరణి. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌లో నాని రెండు జడలతో హైప్ క్రియేట్ చేస్తుండగా.. చాలా కాలం క్రితం నెగెటివ్ రోల్లో కనిపించిన తనికెళ్లభరణిని ఇలా చూపించనుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ది ప్యారడైజ్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి కీ రోల్ పోషిస్తోంది. సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో నాని తల్లిగా కనిపించనుంది. ఈ మూవీలో కిల్ ఫేం రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓ వైపు బ్లాక్ బస్టర్ దసరా కాంబో రిపీట్ అవడం, మరోవైపు జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత నాని-అనిరుధ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

Dhanush – Mrunal | ధనుష్‌తో పెళ్లి పుకార్ల మధ్య మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో… షాక్ అవుతున్న నెటిజన్స్
MSG | లాంగ్ వీకెండ్ టార్గెట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’… మళ్లీ ఊపందుకున్న మెగాస్టార్ సినిమా
Rimi Sen | నటన రాదు అయిన స్టార్ అయ్యాడు.. జాన్ అబ్రహంపై రిమీ సేన్ సంచలన వ్యాఖ్యలు