e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News అమ్మ‌తో వంట‌, ఆంటీతో కుట్లు, అల్లిక‌లు నేర్చుకున్నా: కాజ‌ల్‌

అమ్మ‌తో వంట‌, ఆంటీతో కుట్లు, అల్లిక‌లు నేర్చుకున్నా: కాజ‌ల్‌

అమ్మ‌తో వంట‌, ఆంటీతో కుట్లు, అల్లిక‌లు నేర్చుకున్నా: కాజ‌ల్‌

2020లో బిజినెస్ మెన్ గౌత‌మ్ కిచ్లూను పెండ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది క‌లువు క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్‌ అగ‌ర్వాల్‌. ఈ భామ పెండ్లి త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ తో ముందుకెళ్తుంది. మంచి స్నేహితుడు భ‌ర్త‌గా రావ‌డంతో మ్యారేజ్ త‌ర్వాత కూడా తాను సుర‌క్షితంగా ఫీల‌వుతున్నాన‌ని చెప్పుకొచ్చింది కాజ‌ల్‌. ప్ర‌స్తుతం త‌థాగ‌త సింగ్ తెర‌కెక్కిస్తోన్న హిందీ ప్రాజెక్టు ఉమ షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. ఈ షూటింగ్ లో బిజీగా ఉంది కాజ‌ల్‌. మ‌రోవైపు తెలుగులో న‌టిస్తోన్న ఆచార్య త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నేష‌న‌ల్ మీడియాతో చేసిన చిట్ చాట్‌లో ఈ బ్యూటీ త‌న లైఫ్ గురించి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధామిచ్చింది. పెండ్లి త‌ర్వాత లైఫ్ ఎలా సాగుతుంద‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ..చాలా అద్బుతంగా ఉంది. న‌న్ను ప్రేమిస్తూ, అర్థం చేసుకునే అద్బుత‌మైన వ్య‌క్తి నా జీవితంలోకి రావ‌డం అదృష్టంగా భావిస్తున్నా. గౌత‌మ్ నాకు మంచి స్నేహితుడు. గౌత‌మ్‌తో ఉండ‌టం చాలా సెక్యూర్ గా ఫీల‌వుతున్నా. మంచి వ్య‌క్తి మాత్ర‌మే కాదు. అత‌డు మంచి భ‌ర్త కూడా.

అమ్మ‌తో వంట‌, ఆంటీతో కుట్లు, అల్లిక‌లు నేర్చుకున్నా: కాజ‌ల్‌
- Advertisement -

లాక్ డౌన్ లో ఆన్ లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌య్యారా అని అడుగగా..ఫ‌స్ట్ వేవ్‌లో కొత్త విష‌యాలు నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించా. కానీ సెకండ్ వేవ్‌లో మాత్రం స్కూల్ కు వెళ్ల‌ని చిన్నారుల‌కు క్లాసులు చెప్పాను. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో నేర్చుకున్న పాఠాల‌పై మాట్లాడుతూ..కోవిడ్ టైం కుటుంబం, బంధాలు, ప్రేమ ప్రాముఖ్య‌త‌ను నాకు నేర్పించింది. ఫ్యామిలీ లైఫ్, వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాన‌ని చెప్పింది.

ఫ‌స్ట్ లాక్ డౌన్ లో అమ్మ‌తో క‌లిసి వంటకాలు చేస్తూ గ‌డిపాను. సెకండ్ లాక్ డౌన్ లో అత్త‌మ్మ‌తో క‌లిసి కుట్లు, అల్లిక‌లు నేర్చుకున్నా. పాజిటివ్ గా ఉండ‌టం మ‌నంద‌రికి చాలా ముఖ్యం. అదే న‌న్ను చాలా ప్ర‌శాంతంగా, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండేలా చేసింది. షూటింగ్ కు వెళ్లాల్సి ఉంటే ఉద‌యాన్నే 6 గంట‌ల‌కు లేస్తా..ఆ త‌రువాత‌ చాలా బిజీ అవుతా. ఇదే న‌న్ను రొటీన్ యాంగ్జైటీకి దూరం చేసిందని చెప్పుకొచ్చింది. సినిమాలు డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలో రిలీజ్ అవ‌డం గురించి స్పందిస్తూ..భాష‌, మీడియం, మంచి క‌థ ఎప్పుడూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది. కానీ థియేట‌ర్‌లో సినిమా చూస్తే క‌లిగిన అనుభ‌వాన్ని ఏ మాధ్య‌మం అందించ‌లేదు. కోవిడ్ మ‌హ‌మ్మారిపై భ‌యం వీడిన త‌ర్వాత జ‌నాలు థియేట‌ర్ల‌కు తిరిగొస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది కాజ‌ల్‌.

ఇవి కూడా చదవండి..

అఖిల్ కండ‌లు చూసి అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

తేజ్‌ను చూస్తే ఎమోష‌న‌ల్ అవుతా: కొర‌టాల శివ‌

సైకిల్ తో స‌న్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైర‌ల్‌

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

మా ఎన్నిక‌లు..ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్న‌కు న‌రేశ్ సెటైరిక‌ల్ రిప్లై

బంగార్రాజు చిత్రంలో ‘బేబ‌మ్మ‌’..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మ‌తో వంట‌, ఆంటీతో కుట్లు, అల్లిక‌లు నేర్చుకున్నా: కాజ‌ల్‌
అమ్మ‌తో వంట‌, ఆంటీతో కుట్లు, అల్లిక‌లు నేర్చుకున్నా: కాజ‌ల్‌
అమ్మ‌తో వంట‌, ఆంటీతో కుట్లు, అల్లిక‌లు నేర్చుకున్నా: కాజ‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement