Music Shop Murthy | టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి (Chandini Chowdary) కథానాయికగా నటించింది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి (Harsha Garapati) నిర్మించారు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ సినిమా జూలై 16 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సంగీతమంటే పడిచచ్చిపోయే వ్యక్తి మూర్తి. చిన్నతనం నుంచి సంగీతంపై ఉన్న ఇష్టంతో మ్యూజిక్ షాప్ నిర్వహిస్తుంటాడు. అయితే కుటుంబం గడవడానికి మ్యూజిక్ షాప్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోదు. దీంతో కుటుంబసభ్యులు షాప్‌ను మూసేయాలని మూర్తిని కోరుతారు. ఆదాయం పెంచుకునేందుకు మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ షాప్ పెట్టుకుందామని భార్య (ఆమని) భర్త మూర్తితో తరచూ గొడవ పడుతుంది. ఈ నేపథ్యంలో తన ఆదాయం పెంచుకోవాలా అని ఆలోచిస్తున్న క్రమంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో మూర్తి ఇక తాను డీజే కావాలని బలంగా ఫిక్స్ అవుతాడు.
మరోవైపు అంజనా (చాందినీ చౌదరి) డీజే కావాలని కలలు కంటుంది. అయితే ఇది నాన్న (భానుచందర్)కు నచ్చదు. దీంతో అతడు కోపంతో డీజే వస్తువొకటి పగలగొడతాడు. ఈ వస్తువును రిపేర్ చేసే క్రమంలో మూర్తి, అంజనాకు మధ్య పరిచయం ఏర్పడుతుంది. తనకు డీజే నేర్పిస్తానంటేనే ఆ పరికరాన్ని బాగు చేస్తానని అంజనాకు షరతు పెడతాడు మూర్తి. మరి మూర్తికి అంజనా డీజే నేర్పించిందా..? ఇంతకీ మూర్తి డీజేగా మారాడా..? డీజేగా మారేందుకు మూర్తి హైదరాబాద్‌కు వచ్చి పడ్డ కష్టాలేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
You are attention please the train EtvWin Express is coming near your TV’s and Mobile devices for an non-stop entertainment express 🤩🤩 Stay Tuned!#Haromhara#musicshopmurthy #khokho pic.twitter.com/zJAzqjsIID
— ETV Win (@etvwin) July 12, 2024
Also Read..