Anant Weds Radhika | అంబానీ వెడ్డింగ్ బాష్.. రజినీ కాంత్ టు ధోనీ వరకూ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న స్టార్స్.. VIDEO
Anant Weds Radhika | అనంత్ (Anant Ambani) పెళ్లి తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చెంట్ (Radhika Merchant)తో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్‌లో స్టార్స్ అంతా మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు (Celebrities groove).
Anant Weds Radhika | ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్అంబానీ చిన్న కూమారుడు అనంత్ (Anant Ambani) పెళ్లి తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చెంట్ (Radhika Merchant)తో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు.
రజినీ కాంత్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, మహేశ్ బాబు, రణ్‌బీర్ కపూర్, సూర్య, ఎమ్ ఎస్ ధోనీ సహా పలువురు స్టార్స్ తమ ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్‌లో స్టార్స్ అంతా మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు (Celebrities groove). రజినీకాంత్ నుంచి స్టార్ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ వరకూ ప్రతి ఒక్కరూ బరాత్‌లో కాలు కదిపి ఆకట్టుకున్నారు. రజినీకాంత్, షారుక్ ఖాన్, అలియా భట్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, ఎమ్ఎస్ ధోనీ సహా స్టార్సంతా ఉత్సాహంగా కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. శుక్రవారం ‘శుభ్ వివాహ్’తో మొదలైన ఈ గ్రాండ్ వెడ్డింగ్.. 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగియనున్నాయి.
#WATCH | Celebrities groove at Anant Ambani-Radhika Merchant’s wedding ceremony in Mumbai pic.twitter.com/SA7cb6h2dT
— ANI (@ANI) July 13, 2024
Also Read..
Radhika Merchant | వెడ్డింగ్ లుక్‌లో మెరిసిన రాధికా మర్చంట్..
Anant Weds Radhika | అనంత్‌తో పెళ్లి.. రాధికా మర్చెంట్ వెడ్డింగ్ లుక్ చూశారా.. ఫొటోలు వైరల్
Bypolls | పంజాబ్ జలంధర్ వెస్ట్ స్థానంలో ఆప్ విజయం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

