Choli Ke Peeche Kya Hai | బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సాంగ్ ‘చోళీ కే పీచే క్యా హై'(Choli Ke Peeche Kya Hai) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1993లో వచ్చిన ఖల్నాయక్ సినిమాలోని పాట ఇది. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలోని చోలి కే పిచే క్యా హే పాటకు మాధురీ దీక్షిత్, నీనా గుప్తా వేసిన స్టెప్పులు ఇప్పటికి ఏదో సందర్భంలో ట్రెండ్ అవుతుంటాయి. ఇక ఈ పాటలో డబుల్ మీనింగ్ అర్థాలు ఉన్నాయని దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో అప్పట్లో ఈ సాంగ్‌ను బ్యాన్ కూడా చేసింది. దీంతో ఈ పాట కోసమే క్యాసెట్స్ ను కోనేవారట. 1990లోనే కోట్లకు పైగా క్యాసెట్స్ అమ్ముడై రికార్డు సృష్టించడమే కాకుండా మాధురీ దీక్షిత్‌ని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ ను చేసింది.
ఇదిలావుంటే చాలా రోజుల తర్వాత తన ఫేమస్ సాంగ్ ‘చోళీ కే పీచే క్యా హై'(Choli Ke Peeche Kya Hai) పాటకు స్టెప్పులేసింది మాధురీ. అనంత్ అంబానీ వెడ్డింగ్ అనంతరం బారాత్ జరుగగా ఈ వేడుకలో చోలి కే పిచే క్యా హే, చోలి కే పిచే అంటూ డ్యాన్స్ చేసింది. మాధురీ వెనక టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా మాధురీతో పాటు కాలు కదిపింది. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో శుక్రవారం జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. యూకే మాజీ ప్రధానులు టోని బ్లెయిర్, బోరిస్ జాన్సన్, నటీనటులు జాన్ సీనా, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, రజినీకాంత్, రామ్ చరణ్, మహేశ్ బాబు, క్రీడాకారులు సచిన్ టెండుల్కర్, ధోని, తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు.
#MadhuriDixit exudes sheer elegance as she dances at #AnantAmbani and #RadhikaMerchant‘s wedding.#Trending pic.twitter.com/KMH5g7ZMYo
— Filmfare (@filmfare) July 12, 2024
Also Read..
Radhika Merchan | వెడ్డింగ్ లుక్‌లో మెరిసిన రాధికా మర్చంట్..
Rajinikanth Dance | అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో రజినీకాంత్ డ్యాన్స్.. వీడియో
Shah Rukh Khan | అమితాబ్ బచ్చన్ కాళ్లు మొక్కిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్