టాలీవుడ్లో దూసుకెళ్తున్న థమన్.. పవన్‌తోనే వరుసగా రెండు సినిమాలు
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పుడు దూసుకెళ్తున్నాడు. కొత్త సినిమా అనౌన్స్ అయిందంటే చాలు.. మ్యూజిక్ డైరెక్టర్ పేరు థమన్ అనే కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే వకీల్‌సాబ్, యువరత్న వంటి సినిమాలతో హిట్ కొట్టిన థమన్ చేతిలో ప్రస్తుతం మరో 8 సినిమాల వరకు కూడా ఉన్నాయి. పైగా ఇవన్నీ స్టార్ హీరోల సినిమాలకే కావడం విశేషం.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పుడు దూసుకెళ్తున్నాడు. కొత్త సినిమా అనౌన్స్ అయిందంటే చాలు.. మ్యూజిక్ డైరెక్టర్ పేరు థమన్ అనే కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే వకీల్‌సాబ్, యువరత్న వంటి సినిమాలతో హిట్ కొట్టిన థమన్ చేతిలో ప్రస్తుతం మరో 8 సినిమాల వరకు కూడా ఉన్నాయి. పైగా ఇవన్నీ స్టార్ హీరోల సినిమాలకే కావడం విశేషం.
అల వైకుంఠపురములో.. సినిమా తర్వాత నుంచి థమన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన కోసం స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. దర్శకులు కూడా ఈయనే కావాలని అంటున్నారు. ఇప్పుడు 2021లోనూ ఆయన దూకుడు అలాగే నడుస్తోంది. క్రాక్ అంత పెద్ద హిట్ అయిందంటే కారణం థమన్ ఆర్ఆర్ పేలిపోవడమే. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే వకీల్‌సాబ్, యువరత్న, ఈశ్వరన్ వంటి బడా హీరోల సినిమాలకు సంగీతం అందించాడు థమన్. ఇప్పుడు ఈయన చేతిలో మరో 8 సినిమాలు ఉన్నాయి. అన్నింటికీ మించి మొన్నటివరకు పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా కూడా చేయని థమన్.. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. వకీల్‌సాబ్ సినిమా తర్వాత అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ సినిమాకు ఈయనే మ్యూజిక్ అందిస్తున్నాడు. చిరంజీవి 153వ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
బాలకృష్ణ అఖండ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే గోపిచంద్ మలినేని సినిమాకు పనిచేస్తున్నాడు. మహేశ్ బాబు సర్కార్ వారి పాటతో పాటు మహేశ్, త్రివిక్రమ్ సినిమాకు కూడా స్వరాలు అందిస్తున్నాడు. నాని టక్ జగదీష్, అఖిల్ ఏజెంట్ సినిమాకు కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. ఇక హిందీలో అక్షయ్ కుమార్ సూర్యవంశీ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇవి కాకుండా మరో అర డజన్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?
జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడు.. టాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు
ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
ముంబైలో మకాం.. సమంత స్పందన ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

