Murari Re Release | నేడు సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రిన్స్ బర్త్డే నాడు. మురారి(Murari) రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మహేశ్ కెరీర్లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటి మురారి(Murari). టాలీవుడ్ క్లాసికల్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మహేశ్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా టాలీవుడ్ నుంచి వచ్చిన ఆల్ టైం క్లాసిక్లలో ఒకటిగా నిలిచింది.
తాజాగా ఈ సినిమా థియేటర్లో హౌస్ఫుల్ షోలతో నడుస్తుంది. అయితే అభిమానులు ఈ మూవీ చూస్తుండగా.. ఒక ప్రేమ జంట థియేటర్లోనే పెళ్లి చేసుకుంది. థియేటర్లోకే తాళిబొట్టును తీసుకువచ్చిన వరుడు మహేష్ అభిమానుల ముందే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటనపై కొందరు సపోర్ట్ చేస్తుండగా.. యువత ఏంటి ఇలా మారిపోతుందని కామెంట్లు పెడుతున్నారు.
Nijam ga pelli cheskunaru🤣🔥 #Murari4K pic.twitter.com/kRABlUVBWM
— VardhanDHFM (@_VardhanDHFM_) August 9, 2024
Also Read..