Murari Re Release collections | ప్రిన్స్ మహేశ్ బాబు మురారి రీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆగష్టు 09న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చాలా రోజులకు మహేశ్ మూవీ రీ రిలీజ్ అవ్వడంతో థియేటర్లంతా హౌస్‌ఫుల్ షోలతో రన్ అయ్యింది.
అయితే తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్లో కూడా రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్లో దూమ్ములేపినట్లు తెలుస్తుంది. అమెరికాలో రీ రిలీజ్ చేసిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా మురారి నిలిచింది. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఇక మురారి రీ రిలీజ్ కలెక్షన్లు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 5.5 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా చూసుకుంటే రీ రిలీజ్ కలెక్షన్స్‌లో ఖుషి టాప్ ప్లేస్‌లో ఉండగా.. బిజినెస్‌మాన్ రెండో స్థానంలో ఉంది. మురారి టాప్ 3లో నిలిచింది.
మహేశ్ కెరీర్లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటి మురారి(Murari). టాలీవుడ్ క్లాసికల్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మహేశ్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా టాలీవుడ్ నుంచి వచ్చిన ఆల్ టైం క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచింది.
#MurariReRelease All Time Record ❤️
Thankyou so much #DHFM‘s for making big success Re-Releasing trend 🎯.@urstrulyMahesh #MaheshBabu
#VenigallaVenkatesh pic.twitter.com/k43jH0e0iT— Venigalla Venkatesh 👑 (@VenkateshInX) August 10, 2024
Also Read..