Murari Re Release | ఈ మధ్య తెలుగు యువత అగ్ర హీరోల రీ రిలీజ్ సినిమాలలో నానా హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా రీ రిలీజ్ అయిన మురారి సినిమాలో అయితే ఏకంగా ఒక జంట పెళ్లి కూడా చేసుకుంది. ఆగష్టు 09న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రిన్స్ బర్త్‌డే నాడు. మురారి (Murari) రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
మహేశ్ కెరీర్లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటి మురారి(Murari). టాలీవుడ్ క్లాసికల్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మహేశ్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా టాలీవుడ్ నుంచి వచ్చిన ఆల్ టైం క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచింది.
తాజాగా ఈ సినిమాను ప్రిన్స్ బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ చేయగా.. థియేటర్లంతా హౌస్‌ఫుల్ షోలతో రన్ అయ్యింది. అయితే అభిమానులు ఈ మూవీ చూస్తుండగా.. ఒక ప్రేమ జంట థియేటర్లోనే పెళ్లి చేసుకుంది. థియేటర్లోకే తాళిబొట్టును తీసుకువచ్చిన వరుడు మహేష్ అభిమానుల ముందే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటనపై కొందరు సపోర్ట్ చేస్తుండగా.. యువత ఏంటి ఇలా మారిపోతుందని కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలావుంటే తాజాగా ఈ ఘటనపై మురారి దర్శకుడు కృష్ణవంశీ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ”సర్ కృష్ణవంశీ గారు.. మురారి మూవీలో ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. మీరు అది చూశారా.?” అని ఒక అభిమాని దర్శకుడిని ఎక్స్‌లో ట్యాగ్ చేశాడు. అయితే దీనికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. ”థియేటర్లో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేసి మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేసి అవమానించకండి ప్లీజ్.” అంటూ కృష్ణవంశీ రాసుకొచ్చాడు.
Not good … Dnt ridicule n insult n abuse our great grand CULTURE and TRADITIONS plzzzzz ,🙏🙏🙏🙏 https://t.co/CoTJ0tkX3c
— Krishna Vamsi (@director_kv) August 10, 2024
Also Read..