Vulture | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలం గాణ): రాబందులంటే కేవలం పక్షులు మా త్రమే కాదు. పారిశుద్ధ్య పని చేస్తూ మన పరిసరాలు, ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచే ఆత్మబంధువులు. ఊరి పొలిమేరల్లో పడేసిన జంతు కళేబరాలను రాబందులు తిని బ్యాక్టీరియా, వైరస్ల వ్యాప్తిని అడ్డుకుంటాయి. త ద్వారా కలరా, ఆంత్రాక్స్ లాంటి వ్యాధుల ను నిరోధిస్తాయి. మన దేశంలో రాబందు లు వేగంగా అంతరించిపోతున్నాయి. 1980వ దశకంలో దాదాపు 4 కోట్లుగా ఉ న్న వీటి సంఖ్య 2015 నాటికి 15 వేలకు ప డిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కనీసం 400 రాబందులు కూడా లేవు. దీంతో వివి ధ రకాల వ్యాధులు ప్రబలి 2000-2005 మధ్య కాలంలోనే దాదాపు 5 లక్షల మంది మరణించినట్టు తేలింది. ఆ తర్వాతే రాబందుల వల్ల మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది.
దీంతో భారత్లో రాబందుల సంతతిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య లు చేపట్టింది. ఇంతకీ మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉండాల్సిన రాబందుల సంఖ్య కేవలం 35 ఏండ్లలోనే వేలల్లోకి ఎందుకు పడిపోయింది అని లోతుగా పరిశీలిస్తే.. పశువులకు వాడే ‘డైక్లోఫినాక్’ అనే పురుగుమందు కారణమ ని తేలింది. ఆ మందు ప్రభావానికి లోనైన జంతువుల కళేబరాలను తినడం వల్లే రాబందులు మరణించినట్టు వెల్లడైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2006లో ‘డైక్లోఫినాక్’ను నిషేధించింది. ప్రజారోగ్య సంరక్షణలో ఎంతో కీలకపాత్ర పోషించే రాబందులు లేకపోతే ప్రపంచం ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటిని అధిగమించేందుకు ఏటా 70 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,87,889 కోట్లు) ఖర్చు చేయాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
బెజ్జూర్ ప్రాంతంలో ఆవాసం
ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ ప్రాంతంలో 26 రాబందులు ఉన్న ట్టు గుర్తించారు. వీటి సంఖ్యను పెంచేందుకు విభుప్రకాశ్, నిఖిత దాదాపు 30 ఏండ్ల నుం చి కృషి చేస్తున్నారు. ‘వల్చర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి పొందిన విభుప్రకాశ్ను 2021లో కేంద్రం ‘ప్రాణిమిత్ర’ అవార్డుతో సత్కరించింది