Mr Bachchan Movie | మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ బిజీగా ఉండగా.. హరీష్ శంకర్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఒక అభిమాని హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేస్తూ.. అసలు ఏం అనుకుంటున్నావ్ అన్నా.. రీమేక్ సినిమాలు ఎందుకు వద్దు అంటున్నామో చెప్పడానికి మాకు బోలేడు కారణాలున్నాయి. రీమేక్ మూవీలే ఎందుకు చేయాలనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పు. రీమేక్ అయితే కేవలం మన ఫ్యాన్స్ చూస్తారు అన్నా. కానీ న్యూట్రల్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి. ప్లీజ్ చేంజ్ చేయండి అని రాసుకొచ్చాడు. దీనికి హరీశ్ శంకర్ రిప్లయ్ ఇస్తూ.. చూసే నీకే అంత కన్సర్న్ ఉంటే.. తీసే నాకెంత ఉండాలి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌పై హరీశ్‌ను కొంతమంది సపోర్ట్ చేస్తుండగా.. మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
చూసే నీకే అంత concern ఉంటే
తీసే నాకు ఎంత ఉండాలి ?? https://t.co/oj7D6SMJXX— Harish Shankar .S (@harish2you) August 9, 2024
Also read..