Cannabis | వాషింగ్టన్, ఆగస్టు 10: గంజాయి మొక్కల్లో (కన్నాబిస్) ఔషధ గుణాలున్నాయా లేదా అనే అంశంపై అనేక ఏండ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. దీనిపై ‘సైంటిఫిక్ జర్నల్’ కథనం ప్రకారం, గంజాయి మొక్క కాండం, పుష్పం..ఇలా వివిధ భాగాల నుంచి లభించే పదార్థాల్ని సైకోయాక్టివ్గా పేర్కొంటారు.
ఇందులో నుంచి ఉత్పన్నం చేసిన ‘కన్నాబిజిరోల్’ (సీబీజీ) వినియోగంపై సైంటిస్టులు హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించగా, ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 34 మందిపై సీబీజీని ప్రయోగించగా, వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తగ్గాయి. అలాగే జ్ఞాపకశక్తి కూడా గణనీయంగా మెరుగుదల కనిపించిందని సైంటిస్టులు గుర్తించారు.