Anushka Sharma | బైక్‌పై లొకేషన్‌కు బిగ్‌బీ, అనుష్కశర్మ.. హెల్మెట్ ఎక్కడ అంటూ నెటిజన్ల ప్రశ్న
Anushka Sharma | బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అనుష్కశర్మ (Anushka Sharma) ట్రాఫిక్ రద్దీ కారణంగా షూటింగ్ లొకేషన్‌కు బైక్‌పై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో వారు హెల్మెట్ (Helmet) ధరించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. దీనిపై ముంబై ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందించారు.
Anushka Sharma | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో ట్రాఫిక్ (Traffic) కష్టాలను అధిగమించేందుకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ఇప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. త్వరగా గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఎక్కువగా మెట్రో (Metro)ను అనుసరిస్తున్నారు. కొందరు బాలీవుడ్ నటులు కూడా మెట్రో ప్రయాణం చేశారు. కాగా, రెండు రోజుల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) షూటింగ్ (Shooting Location) కు వెళ్తూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఓ బైకర్‌ను లిఫ్ట్ అడిగి ఇన్టైమ్కు లొకేషన్‌కు చేరుకున్నారు. అనంతరం నటి అనుష్కశర్మ (Anushka Sharma) కూడా ట్రాఫిక్ రద్దీ కారణంగా తన బాడీగార్డ్‌తో కలిసి బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇంత వరకూ బాగనే ఉన్నా.. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వారు హెల్మెట్ (Helmet) ధరించలేదు. ప్రయాణ సమయంలో బైక్ నడిపే వారే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను అక్కడి పోలీసులు అమలు చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వారిద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘హెల్మెట్ ఎక్కడ..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అయితే.. ‘అందరికీ ఒకటే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయి.. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ఈ ఫొటోలను ముంబై ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసి ‘చర్యలు తీసుకోవాలి’ అని కోరుతున్నారు. నెటిజన్ల పోస్టులకు పోలీసులు కూడా స్పందించారు. ‘తదుపరి చర్యల కోసం ఖచ్చితమైన లొకేషన్ వివరాలను అందజేయండి’ అంటూ నెటిజన్లను కోరారు.
हम आपसे आगे की कार्रवाई के लिए सटीक स्थान विवरण प्रदान करने का अनुरोध करते हैं।
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 15, 2023
We request you to provide exact location details for further action.
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 15, 2023
Also Read..
East Godavari | వధువు డ్యాన్స్ చేయలేదని.. పందిట్లో కొట్టుకున్న బంధువులు.. ఐదుగురికి గాయాలు
Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదు.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్
Amazon Layoffs | అమెజాన్‌లో 9 వేల మందిపై వేటు.. భారత్‌లో 500 మందిపై లేఆఫ్స్ ప్రభావం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

