Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదు.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్
Priyanka Chopra | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రాన్ని తాను ఇప్పటి వరకూ చూడలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది.
Priyanka Chopra | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రాన్ని తాను ఇప్పటి వరకూ చూడలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రియాంకను ‘మీరు ఆర్ఆర్ఆర్ చిత్రం చూశారా..?’ అని ప్రశ్నించారు. దీనికి ప్రియాంక ‘నో’ అని సమాధానమిచ్చింది. ‘నాకు సమయం లేదు. నేను సినిమాలు చూడను. కానీ, టీవీ షోలు చూస్తుంటా’ అని బదులిచ్చింది.
ఆస్కార్ (OSCAR) ప్రమోషన్స్‌లో భాగంగా యూఎస్ (US) వెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీమ్‌కి ఆతిథ్యం ఇచ్చిన ప్రియాంక.. ఆ సినిమాను చూడలేదని చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరో విషయం ఏంటంటే.. యూఎస్‌లో ఏర్పాటు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్‌కి కూడా ఆమె హాజరైంది. ఆ సమయంలో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి దిగిన ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంటూ.. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇప్పుడేమో ఆ సినిమాను నేను ఇంత వరకూ చూడలేదు అని ప్రయాంక చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చరణ్ మంచి వ్యక్తి..
ఇదే ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కూడా ప్రియాంక మాట్లాడింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan)ని చూసిన హాలీవుడ్ (Hollywood) ప్రేక్షకులు.. చరణ్‌ని ఇండియన్ బ్రాడ్ పిట్ (Brad Pitt) అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై యాంకర్ ప్రియాంకను ప్రశ్నించారు. ‘రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ అని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి?’ అని అడిగారు. దానికి ప్రియాంక బదులిస్తూ.. ‘కచ్చితంగా ఒప్పుకుంటాను. చరణ్‌లో ఒక చరిష్మా ఉంది. బ్రాడ్ పిట్ గురించి నాకు పెద్దగా తెలియదు. అతడు మంచివాడో? కాదో? కూడా నాకు తెలియదు. కానీ, రామ్ చరణ్ మాత్రం చాలా మంచి వ్యక్తి’ అంటూ చెప్పుకొచ్చింది.
చరణ్-ఎన్టీఆర్.. ఎవరు గొప్ప..?
ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగ్గా.. అందుకు పీసీ సున్నితంగా తిరస్కరించింది. ‘ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్.. భారతదేశంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటులు. వాళ్లిద్దరిలో ఒకరి పేరు చెప్పి నేను చిక్కుల్లో పడాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను తరచుగా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read..
East Godavari | వధువు డ్యాన్స్ చేయలేదని.. పందిట్లో కొట్టుకున్న బంధువులు.. ఐదుగురికి గాయాలు
Delhi School | ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపులు
Amazon Layoffs | అమెజాన్‌లో 9 వేల మందిపై వేటు.. భారత్‌లో 500 మందిపై లేఆఫ్స్ ప్రభావం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

