Amazon Layoffs | అమెజాన్‌లో 9 వేల మందిపై వేటు.. భారత్‌లో 500 మందిపై లేఆఫ్స్ ప్రభావం
Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 18 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. తాజాగా మరోసారి లేఆఫ్స్‌కు సిద్ధమైంది.
Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 18 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. తాజాగా మరోసారి లేఆఫ్స్‌కు సిద్ధమైంది.
రెండో విడత ఉద్యోగుల తొలగింపును మార్చి నెలలోనే కంపెనీ సీఈవో యాండీ జెస్సీ (CEO Andy Jassy) ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ‘రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశాలు ఉండటంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తున్నాం. అందులో భాగంగా మరికొంతమంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించాం. వచ్చే నెలలో ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్వరలోనే దీనిపై ఉద్యోగులకు సమాచారం అందిస్తాం’ అని జెస్సీ (Andy Jassy) చెప్పారు. అమెజాన్ రెండో విడత వార్షిక ప్రణాళిక ప్రక్రియ సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
కంపెనీ నిర్ణయంతో భారత్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 500 మంది వరకు లేఆఫ్‌లకు గురవుతారని అంచనా. తొలగింపుకు గురవుతున్నవారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారు. మార్చి నెలలో 9 వేల మంది ఉద్యోగుల తొలగిస్తామని సంస్థ చేసిన ప్రకటనలో భాగంగానే ఇండియాలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందించారని కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి తెలిపారు.
తాజా లేఆఫ్స్ (Layoffs) తో ఈ సంవత్సరం ఇప్పటివరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించినట్టయింది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్, డివైజెస్, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందినవారు ఉన్నారు.
Also Read..
Girls Molested: 18 మంది మైనర్ అమ్మాయిలను వేధించిన యూపీ టీచర్
DK Shivakumar: వెన్నుపోటు పొడువను.. బ్లాక్మెయిల్ చేయను: డీకే శివకుమార్
Nitin Gadkari | వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు వేయించను.. నా సేవ చూసే ఓట్లేయాలి: గడ్కరీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

