దేవి, మనసంతానువ్వే, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా..ఇలా ఆయన నిర్మించిన ప్రతీ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టినవే. ఇంతకీ ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరని అర్థమయే ఉంటుంది. సీనియర్ నిర్మాత కమ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు (MS Raju). తన కొడుకు సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin) హీరోగా 7 డేస్ 6 నైట్స్ ( 7 Days 6 Nights) సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు ఈయన. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు, సుమంత్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ రాజు చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాను స్టార్ హీరోలు, డైరెక్టర్ల వైపు వెళ్లనని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఒకవేళ మహేశ్ బాబు (Mahesh Babu), ప్రభాస్ మరోసారి తమతో భారీ సినిమాలు చేయాలని ముందుకొచ్చినా తీయనని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. తనకు నచ్చినట్టుగా సినిమా చేయడమంటే ఇష్టమని అందుకే భారీ ప్రాజెక్టుల జోలికి వెళ్లబోనని చెప్పి..టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.
మరోవైపు ఎంఎస్ రాజు డైరెక్టర్‌గా రీసెంట్గా సతి సినిమాను కూడా ప్రకటించేశారు. సుమంత్ అశ్విన్-మెహెర్ చాహల్ హీరోహీయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది.