Kamal Haasan | సూర్యకు కమల్ హాసన్ ఖరీదైన గిఫ్ట్..అదేంటో తెలుసా..?
ఇప్పటికే తనకు మంచి సక్సెస్ అందించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు ఖరీదైన కారు బహుమతిగా అందించి..టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు కమల్ హాసన్ (Kamal Haasan).
విక్రమ్ (Vikram) బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల పంట పండిస్తుండటంతో ఫుల్ జోష్ మీదున్నాడు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan). ఇప్పటికే తనకు మంచి సక్సెస్ అందించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు ఖరీదైన కారు బహుమతిగా అందించి..టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు కమల్ హాసన్. ఖరీదైన లెక్సస్ సెడాన్ ముందు లోకేశ్, కమల్ హాసన్ దిగిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా కమల్ హాసన్ తన కోస్టార్ సూర్య (Suriya)కు గిఫ్ట్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఇంతకీ సూర్యకు ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..? రోలెక్స్ బ్రాండెడ్ వాచ్. సూర్య చేతికి రోలెక్స్ వాచ్ పెట్టి..దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇలాంటి క్షణం జీవితాన్ని అందంగా మారుస్తుంది.రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నా..అని సూర్య ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా సూర్యతో డైరెక్టర్, కమల్ అండ్ టీం దిగిన ఫొటోలు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. విక్రమ్‌లో సూర్య పోషించిన పాత్ర పేరు కూడా రోలెక్స్ కావడం ఇంట్రెస్టింగ్ విషయం. కమల్ హాసన్ ఇప్పటికే విక్రమ్ సినిమాకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు 13 అపాచీ బైక్స్ ను అందజేశాడు.
విక్రమ్ జూన్ 3న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలవగా..తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా విక్రమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన విక్రమ్‌లో స్టార్ యాక్టర్లు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ , సూర్య కీలక పాత్రలు పోషించారు.
A moment like this makes life beautiful! Thank you Anna for your #Rolex! @ikamalhaasan pic.twitter.com/uAfAM8bVkM
— Suriya Sivakumar (@Suriya_offl) June 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

