Pakka commercial glimpse | ఇంట్రెస్టింగ్గా ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ అప్డేట్ వీడియో
గోపీచంద్ (Gopichand ), మారుతి (maruthi) కాంబినేషన్లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ (Pakka commercial). తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తూ..గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉండబోతుందో క్యూరియాసిటీని కలిగించేలా ఈ వీడియోను కట్ చేశారు.
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand ), మారుతి (maruthi) కాంబినేషన్లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ (Pakka commercial). గోపిచంద్ 29వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీలో రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తూ..గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉండబోతుందో క్యూరియాసిటీని కలిగించేలా ఈ వీడియోను కట్ చేశారు. జూన్ 12న రానుంది ట్రైలర్ .
‘మీరు కేసు ఒప్పుకునేముందు ఫీజు వద్దు రమ్మంటారు..పనయ్యాక వాడిని వంగోపెట్టి తరిమి అంటూ శ్రీనివాస్ రెడ్డి డైలాగ్స్ చెబుతుండగా..వీడియో బఫర్ అవుతుండటం చూడొచ్చు. ఏంటి అలా చూస్తున్నారు వీడియో బఫర్ అవ్వట్లేదు. మేమే ఆపాం..ఓ ముహూర్తం, టైం చూసి వదులుదామని. వచ్చినపుడు గట్టిగా చూసి ఎంకరేజ్ చేయండి..థ్యాంక్స్’ అంటూ మారుతి వాయిస్ ఓవర్తో ముగిసింది వీడియో. పక్కా కమర్షియల్ చిత్రం జులై 1 2022న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ మూవీకి జాక్స్ బీజోయ్ మ్యూజిక్ డైరెక్టర్..కాగా జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీవాసు (Bunny Vasu) నిర్మిస్తోండగా…SKN కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి కీ రోల్స్ లో నటిస్తున్నారు. సీటీమార్ సినిమా తర్వాత చేస్తున్న ప్రాజెక్టు కావడంతో..ఈ మూవీతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు గోపీచంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

