Mrunal Thakur | కన్నీరు పెట్టుకున్న సీతారామం బ్యూటీ.. ఏమైందంటే..?
Mrunal Thakur | సీతారామం (Sita Ramam) సినిమాతో టాలీవుడ్ (Tollywood)లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ చిత్రంలో సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. కాగా, మృణాల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి తెగ వైరలవుతోంది. తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఏడుస్తూ కనిపించింది.
Mrunal Thakur | సీతారామం (Sita Ramam) సినిమాతో టాలీవుడ్ (Tollywood)లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ చిత్రంలో సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమా తెచ్చిన పాపులారిటీతో ఇప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సినిమాలే కాదు మృణాల్ సోషల్ మీడియా (Social media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, మృణాల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి తెగ వైరలవుతోంది.
తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఏడుస్తూ కనిపించింది. అయితే, గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించేందుకే నటి ఆ ఫోటోను షేర్ చేసింది. మృణాల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇలా రాసుకొచ్చింది. ‘నిన్న చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ రోజు నేను చాలా సంతోషంగా, ధైర్యంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి వారి కథలో కొన్ని పేజీలు ఉంటాయి. కానీ వాటిని అందరితో పంచుకునేందుకు ఆసక్తి చూపరు. నేను వాటిని అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఇతరులకు నేర్పాలి’ అంటూ రాసుకొచ్చింది. పోస్ట్‌కు ఏడుస్తున్న ఫొటోను జత చేసింది.
ఇది చూసిన ఆమె అభిమానులు ఏం జరిగిందో అని కంగారుపడిపోతున్నారు. ‘మేడం ఎందుకు ఏడుస్తున్నారు..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ‘ఆ పోస్ట్‌లో నేను పెట్టిన ఫొటో.. ఇప్పటిది కాదు. గతంలో నాకు కఠిన పరిస్థితులు ఎదురైన రోజుల్లో ఆ ఫొటో తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నా’ అంటూ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read..
Delhi Quake | హిందూకుష్ పర్వతాల్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్..!
Usha Gokani | మహాత్మాగాంధీ మనవరాలు మృతి
India Corona | దేశంలో ఏడు వేలు దాటిన యాక్టివ్ కేసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

