Mrunal Thakur | తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న భామల్లో టాప్‌లో ఉంటుంది మృణాళ్ ఠాకూర్. ఈ మరాఠీ ముద్దుగుమ్మ లైనప్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. కాగా ఈ బ్యూటీ ధనుష్‌తో క్లోజ్‌గా కనిపిస్తుందని.. ఇద్దరూ ఫిబ్రవరి 14న పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే అలాంటిదేమీ లేదని అవన్నీ వట్టి పుకార్లేనని మృణాళ్ ఠాకూర్ సన్నిహితవర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే అందరి దృష్టిని ఈ టాపిక్ నుంచి మళ్లిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర అప్డేట్ షేర్ చేసింది మృణాళ్ ఠాకూర్. కొత్త సంవత్సరం, కొత్త స్క్రిప్ట్, కొత్త ప్రారంభం.. అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. తాను హైదరాబాద్‌లో ఉన్నానని చెబుతూ.. కొత్త తెలుగు సినిమా కోసం పనిచేస్తున్నట్టు హింట్ ఇచ్చింది.
మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం అట్లీ-అల్లు అర్జున్ సినిమా AA22లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించే హింట్ ఇచ్చిందంటూ నెట్టింట చర్చ నడుస్తుంది. అయితే కొత్త ప్రాజెక్టు అనే సరికి మృణాళ్ ఠాకూర్ చేస్తున్న సినిమా ఇదేనా.. లేదంటూ పూర్తిగా కొత్త సినిమానా..? అంటూ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. ఈ భామ ఇంతకు ఏ సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చిందనేది సస్పెన్స్ నెలకొంది.
కాగా మృణాళ్ ఠాకూర్, సిద్దార్థ్ చతుర్వేదితో కలిసి నటిస్తోన్న దో దివానే షెహర్ మే సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. అడివిశేష్‌తో చేస్తున్న డెకాయిట్ మార్చి 19న విడుదల కానుంది.

Salaar 2 | ప్రభాస్ సలార్ 2 టీజర్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ తేదీనో తెలుసా..?
Actor Srikanth | ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో నటుడు శ్రీకాంత్.. వీడియో వైరల్