మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan ) లెఫ్టినెంట్ రామ్ పేరుతో తెలుగులో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఫర్హాన్ అక్తర్ తో కలిసి తుఫాన్ చిత్రంలో మెరిసిన మృణాళ్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ మృణాళ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
పోస్టర్ లో మృణాళ్ సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తుండగా..అద్దంలో అటు వైపు దుల్కర్ కనిపిస్తున్న లుక్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చితాన్ని మహానటి మేకర్స్ స్వప్నా సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సౌండ్ ట్రాక్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే దుల్కర్ సైకిల్ పై కూర్చుని వెళ్తున్న స్టిల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
Introducing @mrunal0801 as Sita
— BA Raju's Team (@baraju_SuperHit) August 1, 2021
Happy birthday Sita..u will conquer hearts…
Here's the Glimpse: https://t.co/qlpWa4oPMN#declassifiessoon @dulQuer @hanurpudi @Composer_Vishal@AshwiniDuttCh @SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/Zv0MpUXnoN
ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..