Mrunal Thakur | తెలుగు, తమిళంతోపాటు హిందీ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటారు మృణాళ్ ఠాకూర్, ధనుష్. ఈ ఇద్దరు ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారని తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. కొందరు సోషల్ మీడియా యూజర్లు ఏకంగా మృణాళ్ ఠాకూర్ Spotify మ్యూజిక్ ప్లేలిస్టును వీరిద్దరి లిలేషన్షిప్కు సాక్ష్యంగా చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వార్తలపై ఫైనల్‌గా మృణాళ్ ఠాకూర్ స్పందించింది. కోలీవుడ్ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో డేటింగ్ వార్తలపై స్పష్టత ఇచ్చింది. తనపై వస్తున్న పుకార్ల గురించి తెలుసునన్న మృణాళ్ ఠాకూర్.. ఆ పుకార్లు చాలా ఎంటర్టైనింగ్గా, నవ్వొచ్చేలా ఉన్నాయని చెప్పింది. ‘మేమిద్దరం స్నేహితులం. ధనుష్ నాకు మంచి స్నేహితుడు. కేవలం అజయ్ దేవ్గన్ ఆహ్వానించడం వల్లే సన్నాఫ్ సర్దార్ 2 ఈవెంట్లో పాల్గొన్నాడని.. ధనుష్‌కు తాను ఇన్విటేషన్‌ను పంపలేదని స్పష్టం చేసింది మృణాళ్ ఠాకూర్. ఎవరూ కూడా ఆ విషయాన్ని అపార్థం చేసుకోవద్దని’ చెప్పింది.
ఈ కామెంట్స్‌తో ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని క్లారిటీ ఇచ్చేసింది మృణాళ్ ఠాకూర్. మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో మూడు సినిమాలు, తెలుగులో మరో మూవీ చేస్తోంది. ఇటీవలే కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ధనుష్.. ప్రస్తుతం ఇడ్లీ కడైతోపాటు పలు సినిమాలను లైన్లో పెట్టాడు.
ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో వస్తోన్న తేరే ఇష్క్ మే మూవీ షూటింగ్ ముగింపు పార్టీలో మృణాళ్ఠాకూర్ కనిపించడంతో మొదటిసారి ధనుష్‌తో ఈ భామ రిలేషన్షిప్లో ఉన్నట్టు వార్తలు తెరపైకి చ్చాయి. అయితే మరోసారి సన్నాఫ్ సర్దార్ 2 ఈవెంట్లో ధనుష్ కనిపించడంతో ఆ పుకార్లు మరోసారి హల్ చల్ చేశాయి.
సన్నాఫ్ సర్దార్ 2 ఈవెంట్లో ఇలా..
Dhanush and Mrunal Thakur are dating? pic.twitter.com/ItWYJdsm8a
— Aryan (@Pokeamole_) August 3, 2025
Param Sundari Trailer | జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ట్రైలర్ చూశారా.!
Coolie Movie | రజినీకాంత్ ‘కూలీ’ క్రేజ్: ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించిన సింగపూర్ కంపెనీ
Coolie Pre Sales | రజనీ మేనియా.. విడుదలకు ముందే ‘కూలీ’ రికార్డు