Mr Celebrity | పాపులర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’ (Mr Celebrity). రవికిశోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్‌ను టాలీవుడ్ యాక్టర్ రానా లాంఛ్ చేశాడు.
క్రైం థ్రిల్లర్ జోనర్లో సినిమా రాబోతున్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగుతున్న ట్రైలర్లో విలన్ ఎవరనేది సస్పెన్స్‌లో పెట్టి క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ యజమాన్య సంగీతం అందిస్తున్నాడు.
పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్‌కు ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉందని ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథనందించడమే కాదు.. నటులుగా కూడా అలరించిన పరుచూరి బ్రదర్స్ మనవడు ఎంట్రీ సినిమా కావడంతో.. సుదర్శన్ మరి ఎలాంటి ఇంప్రెషన్ కొట్టేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
మిస్టర్ సెలబ్రిటీ ట్రైలర్..
Mammootty | షూటింగ్ టైం.. లొకేషన్లో జైలర్ విలన్‌తో మమ్ముట్టి
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !