Mr Bachchan Movie | మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి షో రీల్‌తో పాటు పాటలు విడుదల చేయగా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను
ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
విడుదలకు ఇంకా 18 రోజులే ఉండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీ టీజర్‌ను బోనాల పండుగ కానుకగా రేపు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
On your way with a dose of whistling Mass Entertainment 🤗#MrBachchan Teaser on 28th July!
In cinemas August 15th 🙂 pic.twitter.com/NUaoNMIRJF— Ravi Teja (@RaviTeja_offl) July 27, 2024
Also Read..
Vijaya Nirmala | సూపర్‌స్టార్‌తో పెళ్లికి మా నాన్న అభ్యంతరం చెప్పారు..!
Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో పొరపాటు.. దక్షిణ కొరియాను ఉత్తర కొరియాగా పరిచయం
Jovial Star | హీరో రాజ్ తరుణ్‌కు కొత్త ట్యాగ్.. ఇంతకీ ఏ స్టార్ తెలుసా.!