తెలుగు ,తమిళం,కన్నడ ,మళయాళ భాషల్లో 150 పైగా సినిమాల్లో నటించి దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కిన ఘనత సొంతం చేసుకున్న సీనియర్ నటి స్వర్గీయ విజయనిర్మల. ఆమె మీనా అనే తెలుగు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కృష్ణా ముకుందా మురారి అనే పాటలో చిన్ని కృష్ణుడిలాగా అలరించింది. అమ్మ కడుపు చల్లగా.. అత్త కడుపు చల్లగా.. అంటూ బాపు తీసిన సాక్షి చిత్రంలో అందరిని మెప్పించింది. ఆ తరువాత వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు అంటూ సీతారామరాజు సినిమాలో ఆమె చేసిన పర్ ఫార్మెన్స్ చిరస్మరణీయం.
ఈ విధంగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయనిర్మల గారు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో కృష్ణ గారితో పెళ్ళికి సంబంధించిన విషయాలను ఈ విధంగా పంచుకున్నారు. తిరుపతిలో అమ్మ కోసం షూటంగ్ జరుగుతున్న సమయంలో నాకు ,కృష్ణ గారికి వివాహం జరిగింది. రమాప్రభ వంటి దగ్గరి బంధువులకు తప్ప సినిమా పరిశ్రమలో ఎవరికి ముందుగా పెళ్ళి గురించి చెప్పలేదు. కానీ మా నాన్న కృష్ణగారి తో పెళ్ళి కి అభ్యంతరం చెప్పారు. కానీ కృష్ణ గారితో నాకు ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను. ఆయన చాలా మంచి వ్యక్తి, నేనంటే చాలా అభిమానం చూపిస్తారు. ఇవన్నీ చూసిన తరువాత నాన్న మా ఇద్దరిని ఆశీర్వదించారు అని స్వర్గీయ విజయనిర్మల తన జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకున్నారు.
ఇక ఆమె తన కెరీర్ గురించి వివరిస్తూ నటన కన్నా దర్శకత్వంమే నాకు బాగా సంతృప్తినిచ్చింది. 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించాను. అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలుగా నాపేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కడం నాకు ఎంతో సంతోషానిచ్చింది. ఎక్కువ సినిమాలు పద్మాలయా పతాకంపైనే నిర్మించాను. కొన్ని సినిమాలు మాత్రమే బయటి నిర్మాతలతో నిర్మించాను. నాకు సినిమా అప్పగిస్తే నిర్మాతకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకుంటాను. నేను కమర్షియల్ దర్శకురాలినే. నేను తీసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమాలు మూడు పువ్వులు – ఆరు కాయలు, శంఖు తీర్ధం , జయసుధ, విజయ శాంతి హీరోయిన్లను నేనే తెలుగు తెరకు పరిచయం చేశాను. వాళ్లు తరువాత ఎంతగా రాణించారో అందరికి తెలిసిందే అంటూ చెప్పుకొచ్చారు.
Also Read :
Rakt Bramhand | ‘రక్త్ బ్రహ్మాండ్’ అంటూ వస్తున్న ‘తుంబాడ్’ దర్శకుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
Vikrant Massey | ’12 ఫెయిల్’ సినిమాకు నేషనల్ అవార్డు అంటూ వార్తలు.. హీరో రియాక్షన్ ఇదే.!