Rakt Bramhand | బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘తుంబాడ్’ (Tumbbad). గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2018లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు రాహి అనిల్ బార్వే తాజాగా ఒక వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ (Rakt Bramhand). ది బ్లడీ కింగ్డమ్ (The Bloody Kingdom) అనేది ఉప శీర్షిక. ఈ వెబ్ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్&డీకే నిర్మించబోతుండగా.. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్‌లో క్రౌన్ (కిరీటం)పై రక్తం పారుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఫాంటసీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్‌లో సమంత, బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
We’ve got BIGGGGGG news that’ll stir your blood!
We’re pumped to announce our first ever action-fantasy series ❤️🔥🎬@BarveRahi @MenonSita @NetflixIndia pic.twitter.com/tXn9nEysoF— Raj & DK (@rajndk) July 27, 2024
Also read..
Harish Rao | బీఆర్ఎస్ పదేండ్ల శ్రమను.. కాంగ్రెస్ 8 నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారు: హరీశ్ రావు
Kesineni Chinni | రెడ్‌బుక్ అంటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారు.. ఎంపీ కేశినేని చిన్ని ఎద్దేవా
Vikrant Massey | ’12 ఫెయిల్’ సినిమాకు నేషనల్ అవార్డు అంటూ వార్తలు.. హీరో రియాక్షన్ ఇదే.!