Kesineni Chinni | రెడ్‌బుక్ అంటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారు.. ఎంపీ కేశినేని చిన్ని ఎద్దేవా
Kesineni Chinni | వైసీపీ తమ ఉనికి కోల్పోకుండా ఢిల్లీలో ధర్నా డ్రామాలు ఆడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. ఆ ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరినా ఎవరూ రాలేదని, కేవలం అఖిలేశ్ యాదవ్ ఒక్కరే మద్దతిచ్చారని ఎద్దేవా చేశారు.
Kesineni Chinni | వైసీపీ తమ ఉనికి కోల్పోకుండా ఢిల్లీలో ధర్నా డ్రామాలు ఆడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. ఆ ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరినా ఎవరూ రాలేదని, కేవలం అఖిలేశ్ యాదవ్ ఒక్కరే మద్దతిచ్చారని ఎద్దేవా చేశారు. 36 రాజకీయ హత్యలు అన్నారని.. వివరాలు అడిగితే పారిపోయారని సెటైర్లు వేశారు. ఢిల్లీలో ధర్నా ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఆపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ అంటేచాలు.. వైసీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని కేశినేని చిన్ని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం రెండు నెలలుగా చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం శుభపరిణామమని అన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇచ్చారని కొనియాడారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి రూ.900 కోట్లు కేటాయించారని చెప్పుకొచ్చారు.
విజయవాడ నుంచి అన్ని నగరాలకు త్వరలోనే ఎయిర్ కనెక్టివిటీ రానుందని తెలిపారు. ఇందుకనుగుణంగా కొత్త టెర్మినల్ ఏడాదిలోపే పూర్తి కానుందని చెప్పారు. విజయవాడ మహానాడు సెంటర్ నుంచి నిడమానూరు వరకూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారు. ఐదు నెలల్లోనే విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. అమరావతికి 14 నిమిషాల్లోపే చేరుకునేలా పశ్చిమ బైపాస్ రేడియల్ రోడ్లను అనుసంధానిస్తామని చెప్పారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

